సచిన్ కూతురు వ్యాపారంలోకి.. ముంబైలో ‘పిలేట్స్’ స్టూడియో!

  • సచిన్ టెండూల్కర్ కూతురి సొంత స్టూడియో
  • ముంబైలోని అంధేరిలో ప్రారంభం
  • సచిన్ తన కూతురు విజయం పట్ల గర్వం వ్యక్తం చేశారు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ వ్యాపారవేత్తగా మారింది. తన 27వ ఏటనే ముంబైలోని అంధేరిలో ఒక పిలేట్స్ స్టూడియోను ప్రారంభించింది. ఫిట్‌నెస్‌పై ఆమెకున్న ఆసక్తిని ఈ కొత్త వ్యాపారం ద్వారా చాటుకుంది. ఈ ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు సచిన్, అంజలి టెండూల్కర్ హాజరయ్యారు.

సచిన్ ఆనందం..

తన కూతురు విజయం పట్ల సచిన్ టెండూల్కర్ తన సంతోషాన్ని ట్విట్టర్ (ఎక్స్) ద్వారా పంచుకున్నారు. “తల్లిదండ్రులుగా మన పిల్లలు తమకు నచ్చిన పని చేయాలని ఎప్పుడూ కోరుకుంటాం. సారా ఒక పిలేట్స్ స్టూడియోను తెరవడం చూసి మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి” అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. “ఆమె తన సొంత కృషి, నమ్మకంతో ఈ ప్రయాణాన్ని ఒక్కో ఇటుకలా నిర్మించుకుంది” అని కొనియాడారు. సచిన్ ఇంకా మాట్లాడుతూ.. “పోషకాహారం, శారీరక కదలికలు మా జీవితాల్లో ఎప్పుడూ ముఖ్యమైనవి. ఇప్పుడు సారా అదే ఆలోచనను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తుండటం ఎంతో ప్రత్యేకంగా ఉంది” అని తెలిపారు. ఈ వేడుకకు సారా సోదరుడు అర్జున్ టెండూల్కర్ కాబోయే భార్య సానియా చందోక్ కూడా హాజరయ్యారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *