
అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరిన్ని సర్వీసులను ప్రారంభించినట్లు వెల్లడించింది. శబరిమల యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ లోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి కేరళకు అదనంగా ప్రత్యేక రైళ్లు నడుపుతామని రైల్వే శాఖ తెలిపింది.జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేక రైళ్ల వివరాలు:
- ట్రైన్ నెంబర్ 07065: హైదరాబాద్ (నాంపల్లి) – కొట్టాయం: జనవరి 7, 14, 21, 28 తేదీలలో మధ్యాహ్నం 12.00కి బయలుదేరి బుధవారం సాయంత్రం 4.10కి కొట్టాయానికి చేరుకుంటుంది.
- ట్రైన్ నెంబర్ 07066: కొట్టాయం – సికింద్రాబాద్: జనవరి 8, 15, 22, 29 తేదీలలో సాయంత్రం 6.10కి బయలుదేరి గురువారం రాత్రి 11.45కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- ట్రైన్ నెంబర్ 07167: మౌలాలి – కొట్టాయం: జనవరి 3, 10, 17, 24, 31 తేదీలలో మధ్యాహ్నం 2.30కి బయలుదేరి శనివారం సాయంత్రం 6.45కి చేరుకుంటుంది.
- ట్రైన్ నెంబర్ 07168: కొట్టాయం – సికింద్రాబాద్: జనవరి 4, 11, 18, 25 తేదీలలో రాత్రి 9.45కి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 01.30కి చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లను అయ్యప్ప భక్తులు సద్వనియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.





