సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి..! ఆత్మహత్యాయత్నమా? అసలు నిజం ఇదే

  • ప్రముఖ గాయని కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లిన వార్త కలకలం రేపింది
  • ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కుమార్తె క్లారిటీ ఇచ్చారు

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో నివసిస్తున్న సింగర్ కల్పన మంగళవారం సాయంత్రం భర్తకు ఫోన్ చేసి అస్వస్థతకు గురవుతున్నట్లు చెప్పడంతో, ఆయన కాలనీ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సహాయంతో ఆమె ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా, అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఆత్మహత్యాయత్నం కాదని కుటుంబ సభ్యుల వివరణ

తల్లి ఆరోగ్యంపై వచ్చిన పుకార్లను ఆమె కుమార్తె ఖండించారు. కల్పనకు ఇన్‌సోమ్నియా సమస్య ఉండటంతో, డాక్టర్ల సూచన మేరకు మందులు వాడుతున్నారని, ప్రమాదవశాత్తూ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్లారన్నారు. ఇది ఆత్మహత్యాయత్నం కాదని స్పష్టం చేశారు. ‘‘మా తల్లి సింగర్ మాత్రమే కాదు, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ చేస్తున్నారు. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారు’’ అంటూ ఆమె తెలిపారు. మరోవైపు, కల్పన ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్‌పై ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకు చికిత్స కొనసాగుతుందని తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *