సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ – శ్రీకాకుళం రోడ్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు, చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. జనవరి 8, 9, 11, 12, 15, 16 తేదీల్లో వీటి సేవలు అందుబాటులో ఉంటాయని రైల్వే సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు.
కాచిగూడ – శ్రీకాకుళం రోడ్ (07615/07616):
- జనవరి 11, 15 సాయంత్రం 5.45కి కాచిగూడ నుంచి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 9.00కి శ్రీకాకుళం రోడ్ చేరుతుంది.
- జనవరి 12, 16 మధ్యాహ్నం 2.45కి శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.35కి కాచిగూడకు చేరుతుంది.
చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ (07617/07618):
- జనవరి 8 రాత్రి 7.20కి చర్లపల్లి నుంచి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 9.00కి శ్రీకాకుళం రోడ్ చేరుతుంది.
- జనవరి 9 మధ్యాహ్నం 2.45కి శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.30కి చర్లపల్లికి చేరుతుంది. ఈ రైళ్లు ప్రధాన స్టేషన్లన్నింటిలో ఆగుతాయి. కోచ్‌ల వివరాలు, ఇతర సమాచారం రైల్వే అధికారిక ప్రకటనల ద్వారా పొందవచ్చు.






