- విక్రమార్కుడు సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘యువ’ సీరియల్‌లో జక్కన్న గెస్ట్ రోల్
- రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ సీన్స్ ఉన్న ఫన్నీ వీడియో నెట్టింట వైరల్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి ఆయన ఓ సీరియల్‌లో నటించారని మీకు తెలుసా? ‘విక్రమార్కుడు’ సినిమా రిలీజ్ సమయంలో, ‘యువ’ అనే సీరియల్‌లో గెస్ట్ రోల్ చేశారు. ఈ సీరియల్‌లో రష్మీ రేడియో జాకీ పాత్రలో, రాజమౌళి ఆమెను ప్రేమించే వ్యక్తిగా కనిపించారు. ఆ సీన్స్ కలిపిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. “రష్మీతో జక్కన్న లవ్ స్టోరీ..?”, “రాజమౌళి హీరోగా ఉంటే..?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





