విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం బాధాకరం.. సంస్కరిస్తాం!! – మంత్రి నారా లోకేష్

  • ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల భారం ప్రధాన కారణాలు
  • స్కూళ్లలో కౌన్సెలింగ్, ఇంటర్ బోర్డులో సంస్కరణలు

కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా, మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని, వీటి వెనుక ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల భారం వంటి సమస్యలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని, విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. స్కూళ్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకురావడం వంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రైవేట్ విద్యాసంస్థల యజమాన్యాలు కూడా ఆత్మహత్యల నివారణకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యాసంస్థలు బలపడాలని, అందుకు అవసరమైన మౌలిక వసతులు, టీచింగ్ స్టాఫ్ పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *