- దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఘోర పరాజయం
- ఓటమి కి నాదే బాద్యత అంటూ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు
- ‘ప్లాన్ A ఫెయిల్ అయితే, ప్లాన్ B ఉండాలి. కానీ మా వద్ద ప్లాన్ B లేదని ఓటమై బోల్డ్ కామెంట్
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జట్టు ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అంగీకరించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం, ఆ తర్వాత బ్యాటింగ్ వైఫల్యాలు ఈ ఓటమికి ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు. వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోలేకపోయామని సూర్యకుమార్ అన్నారు.
“దక్షిణాఫ్రికా బౌలర్లు వేసిన లెంగ్త్‌లు చూసిన తర్వాతే అసలు ప్లాన్ ఏంటో తెలిసింది. డ్యూ కూడా ప్రభావం చూపింది. ప్లాన్ A ఫెయిల్ అయితే ప్లాన్ B అమల్లో ఉండాలి. కానీ మా వద్ద ప్లాన్ బీ లేదు” అని ఆయన అన్నారు. తాను, శుభ్‌మన్ గిల్ బాధ్యత తీసుకుని జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ కేవలం 4 బంతులు ఆడి 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

నేను క్రీజులో ఉంటే బాగుండేది
“గిల్ మొదటి బంతికే ఔట్ అయ్యాడు. అప్పుడు నేను బాధ్యత తీసుకుని నిలవాలి. నేను క్రీజులో ఉంటే మ్యాచ్ మార్చే అవకాశం ఉండేది, కానీ అది జరగలేదు” అని సూర్యకుమార్ అన్నారు. యువ ఆటగాడు అభిషేక్ శర్మపైనే ఎక్కువ ఆధారపడకూడదని, అతడికీ ఆఫ్ డే ఉండొచ్చని తెలిపారు. బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాట్లాడుతూ, గత మ్యాచ్‌లో బాగా ఆడిన అక్షర్ పటేల్‌ను టెస్టుల ప్రదర్శన నమ్మకంతో ముందుకు పంపామని, కానీ ఈసారి ప్లాన్ పనిచేయలేదని చెప్పుకొచ్చారు.
సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం జట్టు కొత్త ప్లాన్లను సాధించే ప్రయత్నంలో ఉందని, ఈ మ్యాచ్ ఒక కీలక గుణపాఠమని సూర్యకుమార్ తెలిపారు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను చూసి నేర్చుకున్నామని, వచ్చే మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.





