జెస్ట్ కిటికీలో నుంచి చూస్తేనే చితక బాదేస్తారా? టీచర్లూ.. విచక్షణ కోల్పోకండి!!

  • భూపాలపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వివాదాస్పద ఘటన
  • ఇంగ్లీష్‌ టీచర్‌ కర్రతో కొట్టడంతో విద్యార్థినికి తీవ్ర గాయం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంగ్లీష్‌ టీచర్‌ దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను టీచర్‌ కర్రతో విచక్షణారహితంగా కొట్టినట్టు సమాచారం. ఈ ఘటనలో నలుగురు విద్యార్థినులు గాయపడగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చేతి వేలు విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థినుల చెబుతున్న ప్రకారం.. “ఏదో కిటికీలోంచి చూశామని ఎవరో చెప్పారు. దీంతో మమ్మల్ని విచక్షణారహితంగా కొట్టారు” అని విద్యార్థినులు వాపోయారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, జిల్లా విద్యాశాఖ అధికారులు హాస్టల్‌ను పరిశీలించారు. విద్యార్థినుల పట్ల టీచర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, తనిఖీల్లో తేలినట్టు డీఈఓ రాజేందర్‌ తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *