సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులు నిండిపోతున్నాయి. శనివారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ముఖ్యంగా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ తీవ్రంగా పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాలను 10 టోల్‌బూత్‌ల ద్వారా, హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలను 6 గేట్ల ద్వారా సిబ్బంది పంపుతున్నారు.
ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు
చౌటుప్పల్ కూడలిలో జరుగుతున్న అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. రద్దీ మరింత పెరిగే అవకాశముండటంతో, పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీ నగర్ కూడలి ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.





