తిరుమల కల్తీ నెయ్యి కేసు – ఇద్దరు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి

  • నిందితుల్లో ఇద్దరిని మళ్లీ మూడు రోజులు విచారించనున్న సిట్‍
  • పోమిల్ జైన్, అపూర్వ వినయకాంత్ విచారణకు సహకరించలేదని సిట్ విన్నపం

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అరెస్టయిన నిందితుల్లో ఇద్దరిని మరోసారి సిట్ కస్టడీకి అనుమతిస్తూ తిరుపతి రెండో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చావడా, ఏఆర్ డైయిరీ ఎండీ రాజశేఖరన్ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయ్యారు. వీరిలో పోమిల్ జైన్, అపూర్వ వినయకాంత్ విచారణకు సహకరించలేదని సిట్ కోర్టుకు విన్నవించింది. దాంతో మరో మూడు రోజులు కస్టడీకి కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు నుంచి మూడురోజులపాటు సిట్ వారి నుంచి మరింత సమాచారం రాబట్టనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *