మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమం వద్ద చేరారు. ఈ క్రమంలో, భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందినట్లు సమాచారం అందుతోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించాయి.
ప్రధాని మోదీ స్పందన
ఈ ఘటనపై ప్రధాని మోదీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఫోన్ చేసి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు, “త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి” అని సూచించారు. కుంభమేళా మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే, ఈ ఘటన తీవ్రంగా లేదని అధికారులు తెలిపారు. బుధవారం దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Description: A tragic stampede occurred at Kumbh Mela during Mauni Amavasya, resulting in multiple casualties and injuries as devotees rushed to the sacred site. Prime Minister Modi and CM Yogi Adityanath responded to the situation.






