జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమే: ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు!

అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభించకూడదని ట్రంప్‌ స్పష్టం. తన ఆదేశాలను నిలిపివేసిన కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించిన ట్రంప్

అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసే ట్రంప్ (Donald Trump) నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. దీనిపై స్పందించిన ట్రంప్, ఈ హక్కు బానిసల పిల్లల కోసం తీసుకువచ్చినదని, ఇప్పుడు అర్హత లేని వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం, తల్లిదండ్రుల వలస స్థితి ఏమైనా, అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభించాలి. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే దీన్ని రద్దు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై 22 రాష్ట్రాలు వ్యతిరేకంగా కేసులు వేశాయి. సియాటిల్ ఫెడరల్ కోర్టు దీనిని రాజ్యాంగ విరుద్ధమని తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *