మధ్యప్రదేశ్ జబల్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద గురువారం జరిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటార్సీ నుండి జబల్‌పూర్ వరకు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ బోగీ అండర్ గేర్ కింద 290 కిలోమీటర్ల మేర ప్రయాణించిన వ్యక్తి కనుగొనడం సంచలనంగా మారింది. క్యారేజ్ అండ్ వ్యాగన్ విభాగం సిబ్బంది రైలు తనిఖీ చేస్తుండగా ఎస్-4 కోచ్ కింద ఉన్న వ్యక్తిని గుర్తించారు. వెంటనే ఆర్పీఎఫ్‌కు సమాచారం అందించారు. ఆ వ్యక్తిని బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో తప్పింపు చర్యలు
సంబంధిత వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు రైల్వే సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. అతడు తాడుతో బోగీ కింద వేలాడుతూ ప్రాణాపాయం నడుమ ప్రయాణం చేసినట్లు తేలింది. ఇటార్సీ నుండి రైలులోకి ఎక్కినట్లు అతడు అంగీకరించినప్పటికీ, అసలు ఎలా బోగీ కింద చేరాడు అన్నదానిపై ఆర్పీఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు రాబడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.





