లవ్ బ్రేకప్‌ అయ్యిందా? అయితే, ఆ ఉద్యోగం మీకే!! బెంగళూరు కంపెనీ వింత ఆఫర్!

బ్రేకప్ అనుభవించినవారికి మాత్రమే ఉద్యోగ అర్హత.. చీఫ్ డేటింగ్ ఆఫీసర్ పోస్టుకు నోటిఫికేషన్ విడుదల

బెంగళూరుకు చెందిన ఓ మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ విడుదల చేసిన (Job Offer) ఉద్యోగ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కంపెనీ ‘చీఫ్ డేటింగ్ ఆఫీసర్’ పోస్టుకు నియామకం చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి విద్యార్హతలు కాదని, లవ్ బ్రేకప్ (Love Breakup) అనుభవం ఉండాలనే వినూత్న నిబంధన పెట్టింది. ఈ ఉద్యోగానికి అర్హతగా 3 డేట్స్, 2 సిట్యుయేషన్‌షిప్‌లు, కనీసం ఒకసారి బ్రేకప్ అనుభవించాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అంతేకాదు, 2-3 డేటింగ్ యాప్‌లను వాడిన అనుభవం కూడా తప్పనిసరి అట. అభ్యర్థుల నిజాయితీని నమ్ముతామని తెలిపినప్పటికీ, జీతానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ వింత ఉద్యోగ నోటిఫికేషన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘‘ఇంతకంటే మంచి ఆఫర్ ఇంకేముంటుంది?’’, ‘‘ఈ జాబ్‌కి మనమందరం అర్హులమే’’ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *