జన్మతః పౌరసత్వ రద్దు నిర్ణయానికి అమెరికా కోర్టు బ్రేక్!! ఇది రాజ్యాంగ విరుద్ధం!?

అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న జన్మతః పౌరసత్వ హక్కు రద్దు నిర్ణయానికి సియాటిల్ ఫెడరల్ కోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ట్రంప్ జారీ చేసిన ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, ఆ ఆదేశాలను సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ తాత్కాలికంగా నిలిపివేశారు.

ట్రంప్‌ చర్యలు: విభేదాలు మరియు ఫెడరల్‌ కోర్టు తీర్పు

జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ పలు వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో జన్మతః పౌరసత్వ రద్దు ఉత్తర్వు ప్రధానంగా నిలిచింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్, ఓరేగాన్ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగ 14వ సవరణ ప్రకారం, అమెరికాలో జన్మించిన ఎవరికైనా పౌరసత్వం లభించాలనే నిబంధనను ట్రంప్‌ నిర్ణయం ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు వాదించారు. దీనిపై విచారణ జరిపిన సియాటిల్ ఫెడరల్ కోర్టు, ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు నిచ్చింది. ట్రంప్ నిర్ణయంపై ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ప్రస్తుతం, ఈ ఆదేశాల అమలు తాత్కాలికంగా నిలిచిపోవడం తో వలసదారుల పక్షాన ఊరటగా మారింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *