అమెరికాలో వరుస దాడులు: కాల్పుల కలకలం.. సంఘటనలో 11 మందికి గాయాలు!!

అమెరికాలో నూతన సంవత్సరం వేళ వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. లూసియానా రాష్ట్రంలో ఓ వాహనంతో దుండగుడు చెలరేగి 15 మందిని పొట్టనపెట్టుకున్న ఘటన మరువకముందే న్యూయార్క్‌లో మరో ఘోరం జరిగింది. న్యూయార్క్‌లోని క్వీన్స్ నగరంలోని అమేజురా నైట్ క్లబ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జనవరి 1వ తేదీ రాత్రి 11:45 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనలో 11 మంది గాయపడ్డారు.

గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు దుండగులు తుపాకులతో నైట్ క్లబ్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం వారు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. అమేజురా నైట్ క్లబ్‌ జమైకా లాంగ్ ఐలాండ్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉండడంతో ఈ కాల్పుల శబ్ధం స్థానికులకు పెద్ద భయాందోళనను కలిగించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న న్యూయార్క్ పోలీసులు చుట్టుపక్కల రోడ్లను మూసివేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదే సమయంలో, లాస్ వెగాస్‌లో ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల ట్రక్‌లో భారీ పేలుడు సంభవించింది. దాంతో అక్కడి జనాలు తీవ్ర భయానికి గురయ్యారు. గడచిన 24 గంటల వ్యవధిలో మూడు భిన్న దాడులు జరగడం విశేషం. వరుస ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *