పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి కొత్త లుక్ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ లుక్ను విడుదల చేశారు. ఇందులో ఆయన స్టైలిష్గా, ఉత్సాహంగా స్టెప్పులు వేస్తున్నట్లు కనిపించారు. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 6 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో పవన్ కల్యాణ్తో పాటు ఇతర కీలక నటీనటులు పాల్గొంటారు. ఈ షెడ్యూల్తో టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పార్థిబన్, ఎల్బీ శ్రీరామ్, రాంకీ లాంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్గా అయనంక బోస్ పనిచేస్తున్నారు.





