- అండర్-19 ఆసియా కప్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి
- సూర్యవంశీ (137*), ఆరోన్ జార్జి (66*) కలిసి 206 పరుగుల రికార్డు భాగస్వామ్యం
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈ, టీమ్ఇండియా (Team India) మధ్య దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్ వేదికగా వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు దాడితో చెలరేగిపోయాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 55 బంతుల్లోనే శతకం నమోదు చేసి, యుఏఈ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి మరో ఓపెనర్ ఆరోన్ జార్జి (Aaron George) హాఫ్‌సెంచరీ సాధించి అండగా నిలిచాడు.

రికార్డు భాగస్వామ్యం: 206 పరుగులు
26 ఓవర్లు ముగిసేసరికి వైభవ్ సూర్యవంశీ 76 బంతుల్లో 137 పరుగులు* (6 ఫోర్లు, 12 సిక్స్‌లు) చేసి క్రీజులో ఉన్నాడు. అతడికి ఆరోన్ జార్జి 69 బంతుల్లో 66 పరుగులు* (7 ఫోర్లు, 1 సిక్స్) చేసి తోడుగా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి కేవలం 139 బంతుల్లోనే 206 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం కారణంగా జట్టు స్కోర్ ఒక వికెట్ నష్టానికి 214 పరుగులుగా ఉంది. మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (4) మాత్రం బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.





