వల్లభనేని వంశీ కస్టడీపై విచారణ.. తీర్పు గురువారానికి వాయిదా!!

  • అపహరణ, దాడి కేసులో 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్
  • జైల్లో ప్రత్యేక వసతులపై నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై అపహరణ, దాడి కేసులో 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాలని, అందుకోసం వంశీతో పాటు మరో ఇద్దరిని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. అయితే, కేసుతో తనకు సంబంధం లేదని వంశీ కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

జైలు వసతులపై కోర్టు విచారణ

ఇక జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జైలు సూపరింటెండెంట్‌కు నోటీసులు జారీ చేశారు. జైల్లో వంశీకి అందిస్తున్న సౌకర్యాలపై అధికారులు కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. గురువారం విచారణ అనంతరం కోర్టు తుది నిర్ణయం ప్రకటించనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *