- స్కిల్ బేస్డ్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశాం – టీమ్ విజయ్
- ప్రస్తుతానికి ఏ23 కంపెనీతో ఎలాంటి సంబంధం లేదు
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన వేళ, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా దీనిలోకి లాగబడటం చర్చనీయాంశమైంది. అయితే, విజయ్ టీమ్ దీనిపై అధికారిక వివరణ ఇచ్చింది. విజయ్ దేవరకొండ కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే ప్రచారం చేశారు అని టీమ్ స్పష్టం చేసింది. సదరు కంపెనీలు చట్టబద్ధంగా పని చేస్తున్నాయని ధృవీకరించిన తర్వాతే ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారని తెలిపింది. ఏ23 అనే సంస్థకు గతంలో విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పటికీ, ఆ ఒప్పందం గతేడాదే ముగిసిందని, ప్రస్తుతం ఆ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
“కింగ్డమ్” నుంచి “కిల్” వరకూ – విజయ్ కొత్త ప్రాజెక్టులు
సినిమాల పరంగా విజయ్ “కింగ్డమ్” అనే చిత్రంతో మే 30న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తర్వాత రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రెండు ప్రాజెక్టులు ఖరారైనట్లు సమాచారం. “కిల్” చిత్ర దర్శకుడు నగేశ్ భట్‌తోనూ ఓ మూవీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.





