మళ్లీ అదే తడబాటు.. కోహ్లి వీక్‌నెస్‌ను మరోసారి ఉపయోగించుకున్న ఆసీస్ పేసర్!!

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్‌ విరాట్ కోహ్లి ఆటతీరు మరోసారి నిరాశ కలిగించింది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో కోహ్లి తన అభిమానులను అలరించలేకపోయాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పటికీ, కోహ్లి తన ఇన్నింగ్స్‌ను నిలబెట్టలేకపోయాడు. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ మరోసారి కోహ్లి వీక్‌నెస్‌ను ఉపయోగించుకుని వికెట్ పడగొట్టాడు.

31వ ఓవర్‌లో బోలాండ్ విసిరిన గుడ్ లెంగ్త్ డెలివరీని ఆఫ్‌సైడ్ దిశగా ఆడే క్రమంలో కోహ్లి ఎడ్జ్ ఇచ్చి థర్డ్ స్లిప్‌లో వెబ్‌స్టర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అరంగేట్ర ఆటగాడు వెబ్‌స్టర్ అందించిన అద్భుతమైన క్యాచ్‌తో కోహ్లి 17 పరుగులకే మైదానాన్ని వీడాడు. ఆఫ్‌సైడ్ బంతులకు కోహ్లి ఔటవ్వడం ఈ సిరీస్‌లో ఏడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం కోహ్లి ఔట్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *