టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దాదాపు 13 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీలోకి తిరిగి వస్తున్నాడు. గురువారం, జనవరి 30, 2025న దిల్లీ-రైల్వేస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. విరాట్ అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకొని, ఇంటర్నేషనల్ మ్యాచ్ను తలపించేలా సందడి చేస్తున్నారు.ఈ మ్యాచ్కు సంబంధించిన ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది.
కోహ్లీ బ్యాటింగ్ చూడాలనే ఉత్సాహంతో వేల సంఖ్యలో అభిమానులు ఉదయాన్నే స్టేడియానికి చేరుకున్నారు. ‘RCB’ నినాదాలతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. ఈ మ్యాచ్లో కోహ్లీని చూడడానికి వచ్చిన అభిమానుల సంఖ్య అంచనా ప్రకారం 10,000 మందికి పైగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ, ఫ్రీ ఎంట్రీ కారణంగా మరింత మంది స్టేడియంలో చేరడం జరిగింది. కోహ్లీ మేనియా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.





