ఆశ్విన్ లోటుని తీర్చేదెవరు? ఆ ముగ్గురిలో ఎవరు పేరు నిలబడెతారో చూడాలి!!

రవిచంద్రన్ అశ్విన్ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా 65 టెస్టులు ఆడగా, వీటన్నింటిలో అశ్విన్‌ బరిలోకి దిగాడు. ఈ మధ్య కాలంలో అశ్విన్‌ విఫలమైన రెండు సిరీస్‌లలో (2012 ఇంగ్లండ్‌తో, 2024 న్యూజిలాండ్‌తో) తప్ప అన్నీట్లో టీమిండియా జయకేతనం ఎగరవేసింది. మరి, అశ్విన్ తర్వాత మిండియాలో కొత్త స్పిన్నర్ ఎవరంటే?

అశ్విన్‌ గణాంకాలు

  • 106 టెస్టులు
  • 537 వికెట్లు పడగొట్టి, భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
  • ‘బోర్డర్–గావస్కర్‌ ట్రోఫీ’ మూడో టెస్టు అనంతరం అశ్విన్‌ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

వీరిపైనే చర్చ

ఇకపై అశ్విన్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో, స్పిన్‌ మాంత్రికుడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరో చర్చ జరుగుతోంది. ఇందులో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, తనుశ్ కొటియాన్, అక్షర్ పటేల్ పేర్లు వినిపిస్తున్నాయి.

వాషింగ్టన్ సుందర్

  • అశ్విన్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు ఉన్న ఆటగాడు.
  • బ్యాటింగ్‌లోనూ మంచి ప్రతిభ చూపిస్తున్నాడు.
  • తాజా ‘బోర్డర్–గావస్కర్‌ ట్రోఫీ’లో సుందర్‌కు అవకాశం ఇవ్వబడింది.

కుల్దీప్ యాదవ్

  • ఒక దశలో భారత ప్రధాన స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన కుల్దీప్, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆకట్టుకున్నాడు.
  • 30 ఏళ్ల కుల్దీప్ 13 టెస్టుల్లో 56 వికెట్లు పడగొట్టాడు, కానీ బ్యాటింగ్‌లో వెనుకబడి ఉన్నాడు.

అక్షర్ పటేల్

  • గత కొంతకాలంగా మూడో స్పిన్నర్‌గా బరిలోకి దిగుతున్న అక్షర్, 14 టెస్టుల్లో 55 వికెట్లు పడగొట్టాడు.
  • అయితే, అతని బౌలింగ్ శైలి ప్రధాన సమస్యగా మారింది.

తనుశ్ కొటియాన్

  • 26 ఏళ్ల తనుశ్ అరంగేట్రం చేయని ఆటగాడు, దేశవాళీల్లో అపార అనుభవం ఉన్నాడు.
  • ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 33 మ్యాచ్‌లాడి 101 వికెట్లు పడగొట్టాడు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *