- నిర్వాసితుల దూరమయ్యాక, అడవి జంతువుల సంఖ్య పెరిగింది
- చిరుత సంచారం రాత్రి 7 నుండి 9 గంటల మధ్య ఎక్కువగా
ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు నిర్వాసితులతో నిండిన 19 గ్రామాలు 2020 నాటికి ఖాళీ అవ్వడంతో వన్య ప్రాణులు స్వేచ్ఛగా సంచరించేలా మారాయి. వీటిలో కొండ గొర్రెలు, నెమళ్లు, గొర్ర గేదెలు విపరీతంగా పెరిగాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
చిరుత సంచారం – పర్యాటకులకు హెచ్చరిక
కాటేజీల సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని ఫారెస్ట్ రేంజర్ ఎస్కే వలీ తెలిపారు. జనవరి, ఫిబ్రవరి నెలల డేటా ప్రకారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య చిరుత ఎక్కువగా సంచరించినట్లు తేలింది. నీటి కోసం గోదావరి ఒడ్డుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం కాటేజీల చుట్టూ ఇనుప కంచెలు, గేట్లు ఏర్పాటు చేస్తూ రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.






