iOS 26లో 10 కొత్త ఫీచర్లు.. మీ ఫోన్ కాస్తా కంప్యూటర్ అవుతుంది!

  • WWDC 2025లో iOS 26 ప్రధాన ఆకర్షణ
  • Vision Pro డిజైన్ స్పూర్తితో UI మార్పులు

Apple డెవలపర్ కాన్ఫరెన్స్ WWDC 2025 జూన్ 9న ప్రారంభం అవుతుంది. ఇందులో iOS 26కి సంబంధించిన పలు కొత్త ఫీచర్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యమైనది — Liquid Glass అనే డిజైన్. ఇది Vision Pro స్టైల్‌లో, స్క్రీన్‌పై పారదర్శక మెనూలు, మెరిసే లుక్ కలిగిన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. Safari, ఫోన్ యాప్, కెమెరా లాంటి అనేక అప్లికేషన్లు కొత్తగా డిజైన్ కానున్నాయి.

AI, Translation, Desktop మోడ్ — ఇక iPhone ఓ మినీ కంప్యూటర్

iOS 26లో AI బేస్‌డ్ బ్యాటరీ సేవ్ మోడ్, మెసేజ్‌లలో లైవ్ ట్రాన్స్‌లేషన్, పర్సనలైజ్డ్ చాట్ బ్యాక్‌గ్రౌండ్స్, హెల్త్‌కి కొత్త కోచ్ ఫీచర్ లాంటి 10కి పైగా కొత్త మార్పులు ఉంటాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. USB-C పోర్ట్ ఉన్న iPhonesకి డెస్క్‌టాప్ మోడ్ కూడా రానుందట. ఇక Siriకి పెద్ద అప్‌డేట్ లేకపోయినా, ఇంటర్నల్‌గా Apple మంచి ప్లాన్లు వేసుకుంటోందట. ఇదే iOS డిజైన్, 2027లో రానున్న 20వ వార్షికోత్సవ iPhone Glasswing కోసం బేస్‌గా మారనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *