- రంజాన్ మానవత్వం, కరుణ, దాతృత్వానికి ప్రతీక – వైఎస్ జగన్
- అల్లా ఆశీస్సులతో ప్రజలకు శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్ష
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ద్వేషాన్ని, అధర్మాన్ని, చెడు భావనల్ని తొలగించి, మానవత్వాన్ని, కరుణను, సమానత్వాన్ని ప్రబలం చేస్తుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రంజాన్ సామరస్యానికి, సుహృద్భావానికి, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసం క్రమశిక్షణ, ధార్మికతను ప్రతిబింబిస్తుంది. అల్లా చూపిన మార్గంలో మనందరం నడవాలి. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సుభిక్షం, శాంతి, సంతోషం కలగాలని మనసారా కోరుకుంటున్నాను” అని జగన్ తెలిపారు.





