వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి – పరామర్శకు బయల్దేరిన జగన్!!

  • మేదరమెట్లకు వెళ్లి వైవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
  • పిచ్చమ్మ మృతి పట్ల జగన్ దిగ్భ్రాంతి

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల జిల్లా మేదరమెట్లకు బయల్దేరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (85) మృతి నేపథ్యంలో, ఆమె పార్థీవదేహానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనారోగ్యంతో పాటు వయోభారం కారణంగా సోమవారం పిచ్చమ్మ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్ సమావేశాలను వదిలి ఢిల్లీ నుంచి ఒంగోలు చేరుకున్నారు. పార్థీవదేహం నేడు ఒంగోలులో ఉంచి, అనంతరం మేదరమెట్లలో అంత్యక్రియలు జరుపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *