బెట్టింగ్‌ మృతులకు విగ్రహాలా? జగన్‌పై షర్మిల విమర్శ!

  • ‘‘బల ప్రదర్శనల్లో ప్రజల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?’’
  • ‘‘బెట్టింగ్‌లో చనిపోయినవాళ్లకు పరామర్శేంటి, విగ్రహాలేంటి?’’
  • ‘‘ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలేమీ వద్దు’’

ఏపీ మాజీ సీఎం జగన్ నిర్వహించిన బల ప్రదర్శనపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్రంగా స్పందించారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బల ప్రదర్శనల పేరిట ప్రజల ప్రాణాలు పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నిన్నటి బల ప్రదర్శనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. జగన్‌ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. ఇలాంటి శోభాయాత్రలు అవసరం లేదు,’’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘‘బెట్టింగ్‌కు అలవాటుపడి చనిపోయినవాళ్లకు విగ్రహాలేంటీ? ఆ కుటుంబాలకు అసలైన పరామర్శ ఏంటి?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *