- రీజినల్ కోఆర్డినేటర్‌గా తన నియామకానికి జగన్‌కు ధన్యవాదాలు
- గ్రూప్-2 ఉద్యమం వల్ల పాలకులకు యువగళం శక్తి తెలిసింది
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమితులైనందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి టీమ్ వర్క్‌గా పనిచేయాలని పిలుపునిచ్చారు.
‘గ్రూప్-2 ఉద్యమం పాలకులకు బుద్ధి చెప్పింది’
విశాఖ యువత రోడ్డెక్కడం వల్ల గ్రూప్-2 సమస్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్రత పెరిగిందని, అసలైన యువగళం ఎలా ఉంటుందో పాలకులకు అర్థమైందని కన్నబాబు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.
‘జగన్ సేనే బలమైనది’
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా తిప్పి పెట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ‘చంద్రన్న పగ’ , ‘దగా’ పథకాలు మాత్రమే అమలవుతున్నాయని మండిపడ్డారు. త్వరలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేపడతానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ సైన్యంలా ముందుకు కదులుతామని ప్రకటించారు. పార్టీలో కొంతమంది నేతలు బయటకు వెళ్లడం, కొత్తవారు రావడం రాజకీయాల్లో సహజమని, వెళ్లినవారు తిరిగి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే, కొత్తగా ఎవరూ వెళ్లరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.





