- ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టుల మృతి
- ఒకేరోజు బీజాపుర్, కాంకెర్ జిల్లాల్లో జరిగిన ఘటన
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచిన భద్రతా బలగాలు, గురువారం బీజాపుర్, కాంకెర్ అడవుల్లో భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపుర్ – దంతెవాడ సరిహద్దు గంగలూరు ప్రాంతంలో 18 మంది మావోయిస్టులు హతం కాగా, కాంకెర్ జిల్లాలో మరో 4 మంది మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యారని అధికారులు తెలిపారు.
మావోయిస్టుల బలహీనత స్పష్టమవుతోంది
ఇరుజిల్లాల్లో యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతోందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని సమాచారం. మృతదేహాల వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల తాకిడితో మావోయిస్టుల పటిష్టత క్షీణిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.





