లడ్డూ దేవుడి ఆశీర్వాదం.. అది వ్యాపారం కాదు: డివ్యూటీ సీఎం పవన్

Pawan Kalyan TTD Laddu Adulteration
  • తిరుపతిలోని టీటీడీ లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్పందన
  • “లడ్డూ భక్తికి ప్రతీక, అది వ్యాపారం కాదు.” అని పేర్కొన్న పవన్

తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) పట్టు వస్త్రం-లడ్డూ కల్తీ వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. డబ్బు ఉన్న చోట అవినీతి తప్పదని ఆయన అన్నారు. “తిరుపతిలో లడ్డూ కల్తీ అంశం గురించి నేను ఏళ్లుగా చెబుతున్నాను, కానీ ఇప్పుడు అది నిరూపితమైంది” అని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వ్యవహారం భక్తుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వ్యాఖ్యానించారు. లడ్డూ అనేది కేవలం ఆహారం కాదని, అది భక్తుల విశ్వాసం అని పవన్ కల్యాణ్ అన్నారు. భక్తి, నమ్మకం కలిసిన పవిత్ర ప్రసాదం అది.

వ్యాపారం కాదు.. దేవుడి ఆశీర్వాదం:

“లడ్డూ దేవుడి ఆశీర్వాదం, అది వ్యాపారం కాదు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీటీడీ వంటి పవిత్రమైన సంస్థలో కూడా లడ్డూ కల్తీ, పట్టు వస్త్రాల వ్యవహారం బయటపడడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగించే ఈ రకమైన అవకతవకలను ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాన్ని, భక్తిని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.