అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థత!

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (78) ఆస్పత్రిలో చేరారు. వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్లో ఆయనను చేరుస్తున్నట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు మరియు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. వైద్య సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని, క్రిస్మస్ నాటికి ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బిల్ క్లింటన్ 1993 నుండి 2001 వరకు అమెరికా అధ్యక్షుడిగా సేవలందించారు. 2001 తర్వాత, ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2004లో ఛాతీ నొప్పి మరియు శ్వాసకోస సమస్యల కారణంగా నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. 2010లో గుండె సంబంధిత సమస్యతో మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఇటీవల, ఆయన డెమోక్రట్ల తరఫున అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *