సంద్రం సంక్కెక్కిన సాహసి.. సుబిక్ష!!

అది పెరియతలై తీరం.. ఎగసిపడే అలలు.. రాత్రి నల్లటి కారు మబ్బులు.. నడి సంద్రంలో ఏ మాత్రం అదురూ బెదురూ లేకుండా వీర నారిలా పడవపై చేపల వేట కి సిద్ధం అయ్యింది. తనెవరంటే సుభిక్ష. ఓ మత్స్యకారిణి. 23 ఏళ్లఆడపడుచు సముద్రాన్ని తన జీవనాధారంగా ఎంచుకుని సాహసాన్ని తన శక్తిగా మార్చుకుంది. పెరియతలైలో జన్మించిన సుబిక్ష  సంద్రం ఎక్కింది. పురుషులకే పరిమితమైన చేపల వేటకి అమ్మాయిలు కూడా ఏం తీసిపోరని నిరూపిస్తోంది. సంప్రదాయ గోడల్ని కూర్చేస్తూ.. ఏకంగా సముద్రాన్ని తనకు అనుగుణంగా మార్చుకుంది. మత్స్యకారిణి అయ్యింది!! “జీవితంలో నిజమైన సవాళ్లు సముద్రంలోనే ఉంటాయి” అని నమ్మిన సుబిక్ష, తన కుటుంబంతో పాటు మత్స్యశిక్షణలోకి ప్రవేశించింది. ఆమె తండ్రి కుమార్, సోదరుడు లియాండర్‌తో కలిసి వేటకు వెళ్తుంది. అర్థ రాత్రి 1 గంటకు సముద్రంలోకి వెళ్తే.. ఉదయం 10 గంటలకు తిరిగి వస్తుంది. ఇప్పుడు ఇది ఆమె సాధారణ జీవితంగా మారింది. “చీకటి రాత్రి.. ఎగసి పడే అలలు..  మెరుస్తున్న నక్షత్రాలు.. అన్నీ అద్భుతంగా అనిపించాయి..” అని సుబిక్ష తన మొదటి అనుభవం గురించి చెబుతోంది.  తొలి  ప్రయాణం తర్వాత తండ్రి ఆమెపై విశ్వాసం కుదిరింది. అంతే..  అన్ని సవాళ్లు అధిగమించి వేట సాగిస్తోంది. సముద్రంలో మత్స్యకారుల జీవితంలో ఎన్నో కఠినసమస్యలు ఉంటాయి. “వేల కోసం వేర్వేరు వలలు.. పద్ధతులు… అనుసరించాలి. నిత్యం వేట విజయవంత కాదు.. ఒక్కోసారి ఒట్టి చేతులతోనే ఒడ్డుకు వస్తాం. అప్పుడు అందరి కళ్లలోనూ.. నీరసమే!!” అని సుభిక్ష చెబుతోంది. 

https://www.instagram.com/reel/DCRye85vWLl/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ఒక యువ పారిశ్రామికవేత్తగా..!!
ఇంగ్లిష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన సుబిక్ష, తన నిజమైన ఆసక్తి మత్స్య వృత్తిలోనే ఉందని తెలుసుకుంది. ఇప్పుడు ఆమె సీ ఫుడ్ వ్యాపారిణిగా మారింది. ట్యునా, ప్రాన్స్, కింగ్‌ఫిష్ వంటి రకాల పచ్చళ్లను ఆమె తయారు చేస్తోంది. ఇవి దేశీ మార్కెట్‌తో పాటు విదేశాలకు కూడా ఎక్స్ పోర్ట్ చేస్తోంది.  మరో వైపు సముద్రం గాథను పంచే వ్లాగర్ గానూ రాణిస్తోంది.  ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు 2.55 లక్షల మంది సబ్స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.34 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. “మత్స్యకారుల జీవితం ఎంత ప్రమాదకరమో, మనకు అందించే ఆహారానికి వారు ఎంత శ్రమిస్తారో ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నానని” సుబిక్ష చెబుతోంది. సముద్రానికి సంబంధించిన అనేక పద్ధతులను నేర్చుకోవడమే ఆమె తదుపరి లక్ష్యం. “భిన్నమైన మత్స్యశిక్షణ పద్ధతులను తెలుసుకోవడానికి కొత్త గ్రామాలను సందర్శించాలనుకుంటున్నాను,” అని సుబిక్ష  కాన్ఫిడెంట్ గా చెబుతోంది. 

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీ బిజినెస్ ని ఇక్కడ ప్రమోట్ చేస్కోండి !

Your Ads Here (365 x 270 area)
Breaking News
కేటగిరి

మా న్యూస్ అప్డేట్లు కోసం సబ్‌స్క్రైబ్ చేయండి!

Everyday we discover real news for you.