మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత జట్టు 155 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైశ్వాల్ (84), రిషబ్ పంత్ పోరాటం వృథా కాగా, మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. జైశ్వాల్ చివరి వరకు పోరాడినప్పటికీ, ఆసీస్ బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో భారత్‌ను కట్టడి చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమ్మిన్స్ తలా మూడు వికెట్లు తీయగా, స్టార్క్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరగనుంది.





