ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైంది. రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ సాంకేతికతలో ముందుంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా పాల్గొనగా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదటగా 2022 డిసెంబర్ 28న ప్రారంభించేందుకు ప్లాన్ చేసినా, మన్మోహన్ సింగ్ మరణంతో వాయిదా పడింది.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి డ్రైపోర్టు మంజూరు చేయాలని, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని, మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణను ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దగలమని ఆయన అన్నారు.





