మహా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్మిన యువతి ట్రెండ్.. సెల్ఫీలతో క్షణాల్లో వైరల్.. సినీ ఆఫర్ దక్కించుకున్న మోనాలిసా.. బాలీవుడ్ దర్శకుడి ఆఫర్.. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో ఛాన్స్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Kumbh Mela) లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో దద్దరిల్లుతోంది. కోట్లు మంది భక్తులు గంగలో పుణ్యస్నానం ఆచరించేందుకు తరలి వస్తున్నారు. అయితే ఈ కుంభమేళాలో ఓ యువతి కేవలం తన సహజసిద్ధమైన అందంతో నెటిజన్లను ఆకర్షించి వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా.. కుంభమేళాకు రుద్రాక్షలు అమ్మడానికి వచ్చింది. కానీ ఆమె తేనె కళ్ల అందానికి సెల్ఫీల కోసం జనాలు క్యూ కట్టారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులు ఆమెను ఆ ప్రదేశం విడిచిపెట్టేలా చేశారు. కానీ అప్పటికే ఆమె సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
మొదటి సినిమా.. బాలీవుడ్ డెబ్యూ ఖరారు!
బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) మోనాలిసాను చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానని ప్రకటించారు. మొదట నమ్మలేని ఈ విషయం ఇప్పుడు నిజమైంది. మధ్యప్రదేశ్‌లోని ఆమె ఇంటికి స్వయంగా వెళ్లి, ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, తన రాబోయే సినిమా ‘The Diary of Manipur’లో నటించేలా చేశారు. ఇప్పటికే ముంబైలో మోనాలిసాకు నటనలో శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది.






