దిల్లీ ఎన్నికల్లో భాజపా దూసుకెళ్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని, అవినీతి పాలనను తుడిచిపెట్టేశారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధమైన పాలన కోసం దిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని, కుంభకోణాలకు, జైలు పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డారని తెలిపారు. ‘‘దిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం. మేధావి వర్గం అంతా భాజపాకు ఓటు వేసింది. తెలంగాణలో కూడా భాజపా అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలి. శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే పార్టీ భాజపానే’’ అని బండి సంజయ్ తెలిపారు.





