పేదల సాధికారతకు పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ (P4) – ఉగాది నుంచి అమలు!

  • మొదటగా నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్
  • సంస్థాగతంగా పేదరిక నిర్మూలనకు ప్రణాళిక

అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P-4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొదటగా నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. దాదాపు 5,869 కుటుంబాలు దీనిలో భాగమవుతాయని తెలిపారు. P-4 ద్వారా పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ (P4) మోడల్‌ను ఉపయోగించి ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను అనుసంధానం చేసి సహాయపడే విధంగా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించదు, సదుపాయాలు కల్పించేందుకు మాత్రమే దోహదపడుతుంది. స్వచ్ఛందంగా కుటుంబాలు ఈ కార్యక్రమంలో చేరవచ్చు.

లక్ష్యంగా 40 లక్షల కుటుంబాలు

ప్రాంతాల వారీగా హౌస్‌హోల్డ్ సర్వే, గ్రామసభల ధ్రువీకరణ ద్వారా అర్హులైన కుటుంబాలను గుర్తిస్తున్నారు. మొదటి విడతగా ఏపీ 10 జిల్లాల్లో సర్వే ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమై మార్చి 2 నాటికి పూర్తవుతుంద. రెండో విడత మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8న ప్రారంభమై 18న పూర్తవుతుంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలను ‘సమృద్ధి బంధనమ్’ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *