- వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ పూర్తయింది
- విచారణలో సహకరించకపోవడంతో మరోసారి కస్టడీకి పిటిషన్
కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ 3 రోజుల కస్టడీ ముగిసినా విచారణలో సహకరించలేదు. ప్రశ్నలన్నింటికీ ‘తెలియదు’, ‘గుర్తులేదు’ అనే సమాధానాలే ఇచ్చారు. కేవలం తాడేపల్లికి వెళ్లిన విషయాన్ని మాత్రమే ఒప్పుకున్నారు. కీలకమైన ప్రశ్నలకు మాత్రం నోరే విప్పలేదు. మూడు రోజుల విచారణలో పోలీసులు వంశీకి 71 ప్రశ్నలు వేయగా, ఆయన్ను కృష్ణలంక పోలీస్స్టేషన్లో ప్రత్యేక గదుల్లో విచారించారు. ఇతర నిందితులు శివరామకృష్ణ, లక్ష్మీపతి కూడా వంశీ చెప్పిన మేరకే తమ వాంగ్మూలం ఇచ్చారు. వంశీతో మరింత సమాచారం రాబట్టేందుకు మరోసారి కస్టడీ అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం SC-ST కోర్టులో త్వరలో పిటిషన్ దాఖలు చేయనున్నారు.





