“ఏపీ బడ్జెట్‌పై బుగ్గన సెటైర్లు.. ‘కలర్ ఎక్కువ – కంటెంట్ తక్కువ!!’

  • అప్పుల లెక్కలపై కూటమి సర్కార్‌ సర్కస్‌ చూస్తుంటే ఆశ్చర్యం
  • సూపర్‌ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శ

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ అని సెటైర్లు వేశారు. అప్పుల లెక్కలపై మీరు కరెక్టా.. కాగ్ కరెక్టా? అని కూటమి నేతలను ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో అప్పుల లెక్కలు మాయం చేసిందని, 9 నెలల్లోనే ₹1.30 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌లో ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. గతేడాది అన్నదాత సుఖీభవకు ₹4,500 కోట్లు కేటాయించారని.. కానీ అది రైతులకు అందలేదని అన్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *