ప్రతిపక్ష హోదాపై అసత్య ప్రచారం: జగన్‌ వ్యాఖ్యలపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కౌంటర్

  • హైకోర్టులో కేసు పెట్టి, మరోవైపు అసత్యాలు ప్రచారం చేయడం తగదని స్పీకర్‌ వ్యాఖ్యలు
  • 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో కనీసం 18 మంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా

ప్రతిపక్ష హోదాపై వైకాపా ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. బుధవారం శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష హోదా విషయంలో జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉండగానే అసత్యాలు ప్రచారం చేయడం తగదని’’ స్పష్టం చేశారు. ‘‘175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యులైతేనే ప్రతిపక్ష హోదా రానిది. గతంలో జగన్‌ సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే నియమాన్ని విస్మరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు’’ అని స్పీకర్‌ అన్నారు. సభకు దూరంగా ఉండటం ప్రజలకు అన్యాయం చేసుకున్నట్లేనని, ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *