బోరుగడ్డ అనిల్‌కుమార్ బెయిల్‌పై ఉత్కంఠ.. హైకోర్టు చర్యలు తీసుకుంటుందా?

  • నకిలీ మెడికల్‌ సర్టిఫికేట్‌పై మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న అనిల్‌కుమార్
  • హైకోర్టు దీనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం

ఉగుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియనుంది. గతంలో నకిలీ మెడికల్‌ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించి ఈనెల 1న బెయిల్ పొడిగించుకున్న విషయం తెలిసిందే. అయితే, లలితా ఆసుపత్రి వైద్యుడు రాఘవశర్మ ఈ సర్టిఫికెట్ తమ ఆసుపత్రి నుండి జారీ కాలేదని పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. దీంతో పోలీసులు కోర్టుకు ఈ మోసంపై వివరాలు తెలియజేశారు. హైకోర్టు దీనిపై సీరియస్‌గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నకిలీ సర్టిఫికేట్‌పై కేసు?

లలితా ఆసుపత్రి పేరుతో లెటర్ హెడ్ సృష్టించి నకిలీ ధ్రువపత్రం సమర్పించినందుకు ఆసుపత్రి యాజమాన్యం అనిల్‌పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయనపై మరో చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదవుతుంది. అనిల్‌కుమార్ ఇంటి వద్ద ఎవరూ లేరని, ఫోన్లు స్విచ్ఛాఫ్‌లోనే ఉన్నాయని పోలీసుల సమాచారం. పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉండటంతో అతడిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు దస్త్రం సిద్ధం చేసారు. అనంతపురం ఎక్సైజ్ కోర్టులో అనిల్‌కుమార్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. తల్లికి అనారోగ్య కారణంగా 90 రోజుల్లోగా ఛార్జిషీట్‌ దాఖలు చేయనందున డీఫాల్ట్‌ బెయిల్ ఇవ్వాలని న్యాయవాది వాదించారు. కానీ, నకిలీ మెడికల్‌ సర్టిఫికేట్ సమర్పించినందున బెయిల్ మంజూరు చేయరాదని ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు త్వరలోనే ఈ కేసుపై తీర్పు వెలువరించనుంది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *