నిశ్శబ్దంగా కంటి చూపును హరిస్తున్న శత్రువులు ఇవే.. బీ అలర్ట్!!: Dr.హేమలత గుడిసేవ

గ్లకోమా వల్ల శాశ్వత అంధత్వానికి అవకాశం.. తొందరగా గుర్తిస్తే సులభంగా నివారణ..  ఏటా మార్చి 12 వ తేదీన ప్రపంచ గ్లకోమా దినం నిర్వహిస్తున్నారు!!

కంటి ఆరోగ్యాన్ని హాని చేసే ప్రధాన సమస్యల్లో గ్లకోమా, క్యాటరాక్ట్ మెల్లగా, కానీ తీవ్రంగా ప్రభావం చూపించే వ్యాధులు. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ సమస్యలు ఇప్పుడు యువతలోనూ పెరుగుతున్నాయి. కంటి నాడిని దెబ్బతీసే గ్లకోమా, లెన్స్‌ను మబ్బుగా మార్చే క్యాటరాక్ట్ వలన దృష్టి నెమ్మదిగా తగ్గిపోతుంది. శాస్త్రవేత్తల, నిపుణులైన డాక్టర్ల అభిప్రాయం ప్రకారం తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే అంధత్వాన్ని నివారించవచ్చు.

గ్లకోమా – ‘సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్’

గ్లకోమా లక్షణాలు బయటకు కనిపించకపోవడం వల్ల చాలా మంది చివరి దశలోనే గుర్తించగలుగుతున్నారు. దీనివల్ల కంటి ఆప్టిక్ నాడి పాడై దృష్టి శాశ్వతంగా పోయే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, కంటి గాయాలు, వంశపారంపర్య కారణాలతో దీని రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అధిక కంటి పీడనం, తలనొప్పి, అస్పష్ట దృష్టి, కంటి నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

క్యాటరాక్ట్ – కంటి లెన్స్‌లో మబ్బు

క్యాటరాక్ట్ కారణంగా కంటి లెన్స్ మబ్బుగా మారి చూపు మందగిస్తుంది. ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపించినా, యువతలోనూ మధుమేహం, ధూమపానం, స్టెరాయిడ్స్ వాడకం వల్ల వచ్చే అవకాశం ఉంది. మొదట వెలుతురు అస్పష్టంగా కనబడటం, రాత్రిళ్లు బాగా కనిపించకపోవడం, ఒక వస్తువు రెండుగా కనబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శస్త్రచికిత్స ద్వారా దీన్ని సులభంగా తొలగించవచ్చు.

కంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే…

ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి ఐ చెకప్ చేయించుకోవడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, సంతృప్తికరమైన ఆహారం తీసుకోవడం, కంటి సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *