ప్రధాని మోదీ ‘ట్రూత్ సోషల్’లో చేరిక – ట్రంప్‌కు ధన్యవాదాలు!!

  • ట్రంప్ స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మోదీ అకౌంట్ ప్రారంభం
  • “ఇక్కడ అర్థవంతమైన చర్చలకు ఎదురుచూస్తున్నా” – మోదీ ఫస్ట్ పోస్ట్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ లో చేరారు. ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో లెక్స్ ఫ్రీడ్మాన్-మోదీ పాడ్‌కాస్ట్‌ను షేర్ చేసిన రోజునే ఈ చేరిక జరిగింది.ట్రంప్ తన పాడ్‌కాస్ట్‌ను షేర్ చేసినందుకు “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు” అంటూ మోదీ ఓ పోస్ట్ చేశారు. “నా జీవిత ప్రయాణం, భారత నాగరికత, ప్రపంచ సమస్యలపై పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాను” అని వివరించారు.

“ట్రంప్‌కు అమెరికా ఫస్ట్, నాకు ఇండియా ఫస్ట్”

లెక్స్ ఫ్రీడ్మాన్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ ధైర్యాన్ని, దేశభక్తిని ప్రశంసించిన మోదీ, “ట్రంప్‌కు ‘అమెరికా ఫస్ట్’ ఉన్నట్టే, నాకు ‘ఇండియా ఫస్ట్’” అని స్పష్టం చేశారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *