రంగస్థలంపైనా రఘురామ అదరగొట్టారు!!

  • ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడిగా గద పట్టుకుని స్టేజీపై ఎంట్రీ
  • సభనంతా ఆశ్చర్యంతో మంత్రముగ్ధం – ముగిసిన వెంటనే స్టాండింగ్‌ ఓవేషన్

శాసనసభ, మండలి సభ్యుల క్రీడా పోటీలు ముగింపు వేడుకలో ఒక అద్భుతమైన నాటకీయ ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి గెటప్‌లో ఏకపాత్రాభినయం చేస్తూ – తన డైలాగ్‌లతో హాల్‌ను హోరెత్తించారు. వేదికపై ఆయన గద పట్టుకుని రంగప్రవేశం చేయగానే పవన్‌ కల్యాణ్, చంద్రబాబు సహా సభలో ఉన్న ప్రతిపక్ష, అధికార సభ్యులు చప్పట్లు కొట్టారు. రఘురామ నాటకీయంగా “తగ్గేదేలే!” అంటూ సంభాషణలు చెప్పగానే సభ అంతా హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. దుర్యోధనుడి పాత్రలో తనదైన వయ్యారాలతో – భావోద్వేగపూరిత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆయన పలికిన సంభాషణలతో సభలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

స్టాండింగ్‌ ఓవేషన్ – అందరి ప్రశంసలు

ఈ ప్రదర్శన ముగిసిన వెంటనే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు సహా అందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేశారు. “రచ్చబండలోనే కాదు, రంగస్థలంపైనా రఘురామ అదరగొట్టారు” అంటూ చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కితాబిచ్చారు. ఈ ప్రదర్శనపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌, “ఇదొక అద్భుతమైన ప్రదర్శన. ఇంటికి వెళ్లాకా కూడా గుర్తొచ్చి నవ్వుకుంటాం” అంటూ అభినందించారు. సభలోని ప్రతీ ఒక్కరికీ ఈ దుర్యోధన నటన మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *