- 33 బిలియన్ డాలర్లకు ‘ఎక్స్’ను xAI స్వంతం చేసుకుంది
- AI సామర్థ్యాన్ని వాడకందారులకు చేరువ చేయాలనే మస్క్ లక్ష్యం
టెక్ మోగుల్ ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ను తన సొంత AI కంపెనీ xAIకి అమ్మేశారు. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ‘ఎక్స్’లో ప్రకటించారు. ఈ డీల్ విలువ 33 బిలియన్ డాలర్లు అని తెలిపారు. మస్క్ ప్రకారం, ‘ఎక్స్’ను xAIకి కలిపి మరింత మెరుగైన సేవలు అందించాలన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.
AIతో కొత్త దశలోకి ‘ఎక్స్’
2022లో 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్, దానికి ‘ఎక్స్’గా పేరు మార్చారు. ఇప్పుడు, xAI విలువ 80 బిలియన్ డాలర్లకు చేరిందని ఆయన తెలిపారు. AI మోడల్స్‌ను ‘ఎక్స్’తో అనుసంధానం చేసి, వినియోగదారులకు మెరుగైన అనుభవం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఈ రెండు సంస్థల కలయిక సోషల్ మీడియా భవిష్యత్తును మలుపుతిప్పనుందని మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.





