రష్మీ గౌతమ్‌కు శస్త్రచికిత్స: ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడి!

ప్రముఖ యాంకర్, నటి రష్మీ గౌతమ్‌కు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. తన ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వైద్యులు, కుటుంబ సభ్యులకు రష్మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శస్త్రచికిత్సకు ముందు దిగిన ఫొటోలను కూడా ఆమె నెటిజన్లతో పంచుకున్నారు.

“ఐదు రోజుల్లో నా హెమోగ్లోబిన్ 9కి పడిపోయింది. అకాల రక్తస్రావం, భుజం నొప్పితో ఇబ్బందిపడ్డాను. ఏప్రిల్ 18న సర్జరీ జరిగింది, ఇప్పుడు కోలుకుంటున్నా,” అని రష్మీ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

రష్మీ గౌతమ్ జనవరి నుంచి అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో బాధపడినట్లు వెల్లడించారు. మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయిన ఆమె, తన వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసి ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 18న విజయవంతంగా శస్త్రచికిత్స జరిగినట్లు తెలిపిన రష్మీ, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, మరో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఆమె పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ కాగా, అభిమానులు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ పోస్ట్‌ను షేర్ చేయండి:

Facebook
WhatsApp
LinkedIn
Twitter
Pinterest

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *