- ఏసీబీ విచారణపై ప్రభుత్వ ప్రమేయం లేదు, నివేదికల ప్రకారమే చర్యలు
- కాళేశ్వరం, ఫార్ములా రేసు అంశాల్లో విచారణ కొనసాగుతోంది
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏసీబీ విచారణకు అంత హంగామా అవసరమా? ప్రభుత్వంగా మా ప్రమేయం ఏమీ ఉండదు. ఏసీబీ తేల్చే విషయమే నిర్ణయమవుతుంది. కేటీఆర్ విచారణను ముందస్తుగా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఇదంతా ప్రజా ధనం పై విచారణ… విచారణ తర్వాతే చర్యలు’’
‘‘పేదల సొమ్ము ఎక్కడికో వెళ్లిందన్న అనుమానమే ఈ విచారణకు కారణం. ఫార్ములా ఈ-కార్ రేసు, కాళేశ్వరం అంశాలపై విచారణ జరుగుతోంది. నివేదికల ఆధారంగా తరువాతి చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు. అటు రాజకీయ విషయాల్లో మాట్లాడుతూ, ‘‘త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. పెంచిన రిజర్వేషన్లను అమలు చేసి తీరుతాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులందరికీ ఇళ్లు అందుతాయి. మొదటి విడతలో రాలేదని ఎవ్వరూ బాధపడొద్దు. ఏడాదిన్నరలోనే మా హామీలను నెరవేర్చాం’’ అన్నారు.





