- డిసెంబరు 26 నుంచి పెరిగిన రైలు టికెట్ ధరలు అమలు
- లోకల్, స్వల్ప దూర ప్రయాణాలపై భారం లేదు
- మెయిల్, ఎక్స్‌ప్రెస్ ఏసీ చార్జీలు కి.మీ.కు 2 పైసల పెంపు
- దాదాపు రూ. 600 కోట్ల అదనపు ఆదాయమే రైల్వే లక్ష్యం
భారతీయ రైల్వే పెరిగిన నిర్వహణ ఖర్చులను బ్యాలెన్స్ చేసేందుకు టికెట్ ధరలను స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని లోకల్ ప్రయాణాల్లో మార్పులు చేయలేదు.(Indian Railways Train Fare Hike December 26)

- సాధారణ ప్రయాణం: 215 కి.మీ.ల లోపు ఆర్డినరీ క్లాస్ ప్రయాణికులకు ధరల్లో మార్పు లేదు.
- సుదూర ప్రయాణాలు: 215 కి.మీ.ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ టికెట్ పై కి.మీ.కు 1 పైసా పెరిగింది.
- మెయిల్/ఎక్స్‌ప్రెస్: ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కి.మీ.కు 2 పైసల చొప్పున అదనంగా వసూలు చేస్తారు.
సామాన్యుడి జేబుకు చిల్లు పడదా?
నాన్-ఏసీ రైళ్లలో సుదూర ప్రయాణం చేసే వారిపై భారం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 500 కి.మీ.ల దూరం ప్రయాణించే వారు అదనంగా కేవలం రూ. 10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త ధరలు డిసెంబరు 26 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో రైల్వే శాఖకు ఏడాదికి దాదాపు రూ. 600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.





