తెలుగు నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన వి.కార్తిక్ (సన్నీ వర్మ)తో ఆమె జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుక అట్టహాసంగా జరగ్గా, ఈ నెల 20న రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి 9న వీరి నిశ్చితార్థం జరిగింది, అప్పట్లోనే అభినయ కార్తిక్‌ను ఫొటోల ద్వారా అభిమానులకు పరిచయం చేశారు.
“కార్తిక్‌తో నా కొత్త జర్నీ మొదలైంది, అందరి ఆశీస్సులు కావాలి,” అని అభినయ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
‘నేనింతే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అభినయ, హీరోలకు సోదరి పాత్రల్లో ఎక్కువగా కనిపించారు. ‘శంభో శివ శంభో’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు సంపాదించారు. తన నటనతో అభిమానుల హృదయాలను గెలిచిన అభినయ, ఈ సంతోషకర సందర్భంలో అందరి శుభాకాంక్షలు కోరుతున్నారు.





